Home » అమరావతి ముచ్చట్లు » వైఎస్ జగన్‌కు మంత్రి నారా లోకేష్ ప్రశ్న

వైఎస్ జగన్‌కు మంత్రి నారా లోకేష్ ప్రశ్న

సీఎం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు కాలర్ పట్టుకుంటారా?…
గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు కాలర్ పట్టుకుంటారా?… అని ప్రతిపక్ష నేత జగన్‌కు ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో పర్యటించిన నారా లోకేష్ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని తుపాకీతో కాల్చాలని జగన్ నోరు పారేసుకుంటున్నారని లోకేష్ అన్నారు. విభజనతో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తే, సీఎం చంద్రబాబు రాష్ట్రాభివద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని లోకేష్ చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత జగన్, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ లు కేంద్రంపై పోరాడాలని లోకేష్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి బుద్ధి చెప్పాలని నారా లోకేష్ ప్రజలను కోరారు.

Tags

Login

Register | Lost your password?