Home » అమరావతి ముచ్చట్లు » కొత్తాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జ్ఞానభేరి’ కార్యక్రమం

కొత్తాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జ్ఞానభేరి’ కార్యక్రమం

అమరావతి : కొత్తాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలెడ్జి హబ్ గా తీర్చిదిద్ది యువతకు ఉపాధి కల్పించేందుకు వీలుగా ఏపీ సర్కారు ‘జ్ఞానభేరి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాలను మెరుగుపర్చి నైపుణ్యాభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్ లకు ప్రోత్సాహం కల్పించనున్నారు. యూనివర్శిటీలు, ఉన్నతవిద్యామండలి అధికారులతో కలిసి కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 12వేల మంది విద్యార్థుల్లో స్పూర్తి నింపి సీఐఐ, వాణిజ్య పారిశ్రామిక సంస్థల సహకారంతో యువత అభ్యున్నతికి ‘జ్ఞానభేరి’ కార్యక్రమం ద్వార చర్యలు తీసుకోనున్నారు.

Tags

Login

Register | Lost your password?