Home » అమరావతి ముచ్చట్లు » గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని…ఒక్కో జిల్లాకు కొత్తగా 2500 పెన్షన్లు

గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని…ఒక్కో జిల్లాకు కొత్తగా 2500 పెన్షన్లు

విజయవాడ : కొత్తాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామ దర్శిని కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో అర్హులైన 2500 మందికి సామాజిక పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ఒక్కో జిల్లాకు రూ.25 కోట్లు ఇచ్చిన సీఎం ఉపాధి హామి పథకంతో అనుసంధానించి రూ.60 కోట్ల పనులు చేయాలని కోరారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి చెందిన 236 మంది అధికారులకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని వారిని అభినందించారు. పంచాయితీరాజ్, ఐటీ శాఖలను ముందుకు తీసుకువెళ్లి జాతీయ అవార్డులు సాధించిన మంత్రి లోకేశ్ తో పాటు అధికారులను చంద్రబాబు అభినందించారు. విద్యుత్ రంగంలో గణనీయమై అభివృద్ధి సాధించామని అజయ్ జైన్ చెప్పారు. వైద్యఆరోగ్య శాఖలో 53 అవార్డులు సాధించామని కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. నదుల అనుసంధానంతో ఎత్తిపోతల పథకాలు నిర్మించామని జలవనరుల కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. సీఎస్ దినేశ్ కుమార్ తో పాటు పలువురు అధికారులను సీఎం సత్కరించారు.

Tags

Login

Register | Lost your password?