Home » ఎన్ఆర్ఐ న్యూస్ » పాక్ ఎన్నికల్లో పీటీఐ ఘన విజయం…కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్

పాక్ ఎన్నికల్లో పీటీఐ ఘన విజయం…కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో క్రికెట్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్ -ఎ- ఇన్సాఫ్ పార్టీ విజయం సాధించింది. 272 సీట్లకు గాను వందకు పైగా స్థానాల్లో పీటీఐ పార్టీ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 55 సీట్లతో రెండోస్థానానికి పరిమితమైంది. పాక్ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో పోటీ చేసిన ఇమ్రాన్ ఖాన్ అన్నింటిలోనూ విజయం సాధించారు. బేనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ జర్దారీ, కుమారుడు బిలావల్ భుట్టోలు విజయం సాధించారు. 30 సీట్లు సాధించిన పీపీపీ పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థుల మద్ధతుతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీద్ సయీద్ ఓటమి పాలయ్యారు.

Tags

Login

Register | Lost your password?