Home » అమరావతి ముచ్చట్లు » నరేంద్రమోదీకి చంద్రబాబు ప్రశ్నల వర్షం

నరేంద్రమోదీకి చంద్రబాబు ప్రశ్నల వర్షం

న్యూఢిల్లీ : ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే అవినీతి కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తి చేస్తానన్న మోదీ ఇచ్చిన హామీని మర్చి గాలి జనార్దనరెడ్డి లాంటి దోపిడీదారుల అనుచరులకు టికెట్లు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. అశాస్త్రీయంగా ఏపీని విభజించి కష్టాల పాలు చేసిన కేంద్రం నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని చంద్రబాబు మోదీపై ధ్వజమెత్తారు. ఢిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబు ప్రధాని మోదీకి ప్రశ్నల వర్షం కురిపించారు . ఏపీని ఆదుకుంటామని చెప్పిన మోదీ యూటర్న్ తీసుకున్నారని విశ్వాసం లేని వ్యక్తి మోదీ అని ఆయన ధ్వజమెత్తారు. కట్టుబట్టలతో బయటకు వచ్చిన ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చాలని కోరితే కేంద్రం తాత్సారం చేస్తుందన్నారు. ఏపీలో స్టీలు పరిశ్రమను ఏర్పాటు చేసి పదేళ్ల పాటు పన్ను ప్రోత్సహకాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాసంస్థలకు తాము రూ.11,600 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఇచ్చినా భవననిర్మాణాలకు కేంద్రం ఆశించిన మేర నిధులు ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. విమానాశ్రయాలకు వెయ్యి కోట్ల రూపాయల భూములిస్తే ఒక్క విమానాశ్రయాన్ని కూడా అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చలేదని ఇలా చేస్తే ఏపీకి పెట్టుబడులు ఎలా వస్తాయని మోదీని చంద్రబాబు ప్రశ్నించారు. 2019లో తాము ఎన్డీఏతో కలిసి పోటీచేసేదిలేదని చంద్రబాబు ప్రకటించారు.

Tags

Login

Register | Lost your password?