Home » నేరాల న్యూస్ » తాంత్రిక పూజల పేరిట 120 మంది మహిళలపై బాబా అత్యాచారం

తాంత్రిక పూజల పేరిట 120 మంది మహిళలపై బాబా అత్యాచారం

చండీఘడ్ : చండీఘడ్‌లో మరో బాబా బాగోతం వెలుగుచూసింది. తాంత్రిక పూజలతో వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి 120 మంది మహిళలపై అత్యాచారం చేసిన బాబా ఉదంతం సంచలనం రేపింది. హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ జిల్లా తొహానా పట్టణానికి చెందిన బాబా అమర్ పురి అలియాస్ బిల్లు (60) ఆలయ ప్రధాన పూజారిగా పనిచేసేవాడు. సమస్యలు తీరుస్తానని చెప్పి అమాయక మహిళలకు మత్తు మందు కలిపిన తీర్థప్రసాదాలిచ్చి, వారు స్పృహ కోల్పోయాక వారిపై అత్యాచారం చేశాడు. అత్యాచారాన్ని వీడియో కెమెరాతో చిత్రీకరించి వాటిని మహిళలకు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ వారిపై పలు సార్లు అత్యాచారం జరిపాడు. ఇలా ఏకంగా 120 మంది మహిళలపై బాబా అత్యాచారం సాగించాడు. బాబా బంధువులతో పాటు అతని కూతురే బాబా అత్యాచారకాండపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రేపిస్టు బాబాను కటకటాల్లోకి నెట్టారు.

Tags

Login

Register | Lost your password?