Home » టాప్ న్యూస్ » ప్రేమ పెళ్లి గురించి ఇప్పుడే చెప్పలేను…కాజల్ అగర్వాల్ వ్యాఖ్యలు

ప్రేమ పెళ్లి గురించి ఇప్పుడే చెప్పలేను…కాజల్ అగర్వాల్ వ్యాఖ్యలు

వరంగల్ :  తాను ప్రేమ పెళ్లి చేసుకుంటానా లేదా తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానో ఇప్పుడే చెప్పలేనని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. లక్ష్యం నిర్దేశించుకొని కష్టపడితే ఉన్నత స్థానం సంపాదించవచ్చని అన్నారు. తనకు జీవితంలో తల్లిదండ్రులంటే అత్యంత ఇష్టమని…యువతరం మొదట తల్లిదండ్రులను గౌరవించాలని సలహా ఇచ్చారు. హన్మకొండ నగరంలో ఓ మొబైల్ షోరూంను ప్రారంభించిన సినీనటి కాజల్ మీడియాతో మాట్లాడారు. వరంగల్ అంటే తనకెంతో ఇష్టమని, వరంగల్ ఖిలా, రామప్ప ఆలయం, వెయ్యిస్తంభాల గుడి, లక్నవరం సరస్సు అందాలు బాగున్నాయని తనకు అవకాశం వస్తే ఇక్కడ నటిస్తానని కాజల్ వివరించారు.

Tags

Login

Register | Lost your password?