Home » నేరాల న్యూస్ » భార్యను గదిలో బంధించి…అన్నం పెట్టకుండా …

భార్యను గదిలో బంధించి…అన్నం పెట్టకుండా …

లక్నో : భార్య తన పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురాలేదనే కోపంతో సాక్షాత్తూ భర్త భార్యకు విడాకులు ఇచ్చి ఓ గదిలో బంధించి ఆమెకు నెలరోజుల పాటు అన్నం పెట్టకుండా చంపిన కసాయి భర్త బాగోతం యూపీలోని బరేలీ గ్రామంలో వెలుగుచూసింది. బరేలీ గ్రామానికి చెందిన నహీం, రజియా భార్యాభర్తలు. భార్య రజియా అదనపు కట్నం తీసుకురాలేదని భర్త నహీం ఆమెకు ట్రిపుల్ తలాఖ్ ఇవ్వడంతో పాటు ఆమెను నెలరోజుల పాటు గదిలో బంధించి అన్నం పెట్టలేదు. దీంతో ఆకలితో అలమటిస్తూ రజియా కన్ను మూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Login

Register | Lost your password?