Home » టాప్ న్యూస్ » చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ చిత్రం ‘విజేత’ విడుదల

చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ చిత్రం ‘విజేత’ విడుదల

హైదరాబాద్ : చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన ‘విజేత’ చిత్రం గురువారం విడుదలైంది. మాళవిక నాయర్ కథానాయికగా నటించిన విజేత చిత్రం ఫలితం చూసి తర్వాత ఎలాంటి సినిమాలు చేయలనే విషయంలో నిర్ణయం తీసుకుంటానని కల్యాణ్ దేవ్ ప్రకటించారు.విజేత చిత్ర కథ మామయ్య చిరంజీవికి నచ్చడంతో వెంటనే నటించానని ఆయన చెప్పారు. చిన్ననాటి నుంచి డాన్స్, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న తాను పాఠశాలలోనే చిరంజీవి చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నానని కల్యాణ్ దేవ్ చెప్పారు. సినిమాలంటే ఆసక్తితో తాను సత్యానంద్ గారి దగ్గర మూడు నెలలపాటు శిక్షణ పొంది విజేత చిత్రంలో నటించానని ఆయన పేర్కొన్నారు. విజేత ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది.

 

Tags

Login

Register | Lost your password?