Home » ఎన్ఆర్ఐ న్యూస్ » అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగం చేశా…ఎంపీ కవిత వెల్లడి

అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగం చేశా…ఎంపీ కవిత వెల్లడి

హైదరాబాద్ : అమెరికాలో ఎంఎస్ చదివినపుడు తాను స్కాలర్‌షిప్ సరిపోక పార్ట్ టైం ఉద్యోగం చేశానని కల్వకుంట్ల కవిత వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని సెయింట్ మార్టిన్స్ కళాశాలలో జరిగిన స్నాతకోత్సవంలో కవిత పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ సీఎం కుమార్తె అయిన నిజామాబాద్ ఎంపీ కవిత తన పాత స్మృతులను గుర్తు చేసుకున్నారు. తాను ఇంజినీరింగ్ పూర్తి కాగానే ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లానని తనకు వచ్చే 400 డాలర్ల స్కాలర్ షిప్ సరిపోక పార్ట్ టైం ఉద్యోగం చేస్తూనే చదువుకున్నానన్నారు. ఇంజినీరింగ్ లో ఉన్నపుడు తాను సాధారణ విద్యార్థినేనని, బ్యాక్ లాగ్స్ ఉంటే వాటిని పూర్తి చేసేందుకు ప్రణాళిక బద్దంగా చదివానన్నారు. ఎంఎస్ తర్వాత తాను అమెరికాలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేశానని కవిత వివరించారు.

Tags

Login

Register | Lost your password?