Home » కొత్తాంధ్ర వార్తలు » వృద్ధ తల్లిదండ్రులను పోషించని పిల్లలకు ఆరునెలల జైలు శిక్ష

వృద్ధ తల్లిదండ్రులను పోషించని పిల్లలకు ఆరునెలల జైలు శిక్ష

న్యూఢిల్లీ : సమాజంలో వృద్ధుల పట్ల పిల్లల నిర్లక్ష్యంపై కొరడా ఝళిపించాలని కేంద్రం నిర్ణయించింది. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ చూడని పిల్లలకు ఇక కఠిన జైలుశిక్షలు విధించాలని సామాజిక న్యాయశాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా 2007లో చేసిన చట్టాన్ని సవరించి అమ్మానాన్నల పోషణ, వారి సంక్షేమం కోసం కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్రం సమాయత్తమైంది. ప్రస్థుతం పిల్లలు అంటే కుమారులు, కుమార్తెలు, మనవళ్లు మాత్రమే వస్తున్నారు. కాని కొత్త చట్టం ప్రకారం పిల్లలంటే అల్లుళ్లు, కోడళ్లు, మనవళ్లు, దత్తత తీసుకున్న, సవతి పిల్లలు, సంరక్షకుల వద్ద ఉన్న మైనర్లు కూడా పిల్లల కిందే వస్తారు. పిల్లల సంపాదన ఆధారంగా వృద్ధ తల్లిదండ్రుల పోషణ నిమిత్తం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులను వదిలేసినా, వారిని తిట్టినా ఆరునెలల జైలు శిక్ష విధించాలని నిర్ణయించారు.

Tags

Login

Register | Lost your password?