Home » ఎన్ఆర్ఐ న్యూస్ » రిపోర్టరు లైవ్‌లో ఉండగా ఇద్దరు భామల ముద్దుల వర్షం

రిపోర్టరు లైవ్‌లో ఉండగా ఇద్దరు భామల ముద్దుల వర్షం

మాస్కో : రష్యాలో జరుగుతున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ పోటీల లైవ్ రిపోర్టింగ్ లో ముద్దుల వర్షం కురిపించిన ఘటనల వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఓ మహిళా రిపోర్టరు లైవ్ లో మాట్లాడుతుండగా ఇంతలో పక్కనుంచి వచ్చిన ఓ యువకుడు ఆమెకు ముద్దిచ్చి పారిపోయాడు. ఆ ఘటన మరవక ముందే పురుష రిపోర్టరు స్టేడియం నుంచి లైవ్ లో ఫుట్ బాల్ మ్యాచ్ ల వివరాలు చెపుతుండగా అంతలో ఇద్దరు అందాల భామలు ఒకరి తర్వాత మరొకరు వచ్చి అతన్ని ముద్దాడారు. ఒకసారి తమాయించుకున్న రిపోర్టరు రెండోసారి అమ్మాయి ముద్దు పెట్టుకున్నపుడు నవ్వులు చిందించాడు. ఈ వీడియో కాస్తా ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది.

ఆ వీడియోను మీరూ ఓ సారి చూడండి.
ఎంబీఎన్ టీవీ సౌజన్యంతో…

Tags

Login

Register | Lost your password?