Home » ఎన్ఆర్ఐ న్యూస్ » అమెరికన్ తుపాకీ తూటాలకు మరో తెలుగు యువకుడు బలి

అమెరికన్ తుపాకీ తూటాలకు మరో తెలుగు యువకుడు బలి

కన్సాస్ : అమెరికన్ తుపాకీ తూటాలకు మరో తెలుగు యువకుడు మృత్యువాత పడ్డారు. అమెరికాలోని మిస్సోరి యూనివర్శిటీలో ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన కొప్పుల శరత్ అమెరికన్ జరిపిన కాల్పుల్లో నేలకొరిగాడు. వరంగల్ నగరానికి చెందిన శరత్ ఆరునెలల క్రితమే ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లారు. మిస్సోరి యూనివర్శిటీలో చేరిన శరత్ చదువుకుంటూనే కన్సాస్ నగరంలోని ఓ హోటల్ లో తాత్కాలిక ఉద్యోగం చేసేవాడు. ఓ గుర్తుతెలియని వ్యక్తి హోటల్ కు వచ్చి ఆహారం తీసుకోగా, క్యాష్ కౌంటరులో ఉన్న శరత్ అతన్ని బిల్లు చెల్లించమని అడిగాడు. దీంతో ఆగంతకుడు తుపాకీ తీసి శరత్ పై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాల పాలైన శరత్ మరణించారని అమెరికా అధికారులు ప్రకటించారు. చదువుకునేందుకు అమెరికా వెళ్లిన తెలుగు యువకుడు మరణించిన ఘటన వరంగల్ నగరంలో విషాదం నింపింది.

Tags

Login

Register | Lost your password?