Home » కొత్తాంధ్ర వార్తలు » ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులకు కేంద్రం శుభవార్త

ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులకు కేంద్రం శుభవార్త

ఢిల్లీ : ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులకు కేంద్రం శుభవార్త వెల్లడించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థుల సౌలభ్యం కోసం ఫిబ్రవరి, మే నెలల్లో రెండుసార్లు జేఈఈ(మెయిన్స్), నీట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి జావ్ డేకర్ వెల్లడించారు. ఇంజినీరింగ్, వైద్యవిద్యలోకి ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల కోసం ప్రత్యేకంగా జాతీయ పరీక్షల సంస్థను ఏర్పాటు చేసింది. కంప్యూటర్ ఆధారంగా నిర్వహించే ఈ పరీక్షల కోసం సిలబస్ లో ఎలాంటి మార్పు లేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులు ఒక పరీక్ష కాని, రెండు పరీక్షలు కాని రాయవచ్చు. రెండుసార్లు పరీక్ష రాసిన విద్యార్థులకు ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రమంత్రి జావ్ డేకర్ ప్రకటించారు.

Tags

Login

Register | Lost your password?