Home » ఎన్ఆర్ఐ న్యూస్ » అమెరికా అడవుల్లో రేగిన కార్చిచ్చు…సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు

అమెరికా అడవుల్లో రేగిన కార్చిచ్చు…సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు

కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియా -ఒరెగాన్ అడవుల్లో ప్రారంభమైన కార్చిచ్చు వారంరోజులు గడచినా అదుపులోకి రాలేదు. ఈ అగ్నిప్రమాదం వల్ల 12 భవనాలు దగ్థం అయ్యాయి. ఒకరు మరణించారు. అటవీ ప్రాంతంలో రేగిన కార్చిచ్చు కాగ్నబుక్ పట్టణం వైపు వస్తుండటంతో అమెరికా అధికారులు పట్టణంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. 360 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరిస్తున్న మంటలను అదుపు చేయడానికి అమెరికా అగ్నిమాపక శాఖ అధికారులు శ్రమిస్తున్నారు. అటవీ ప్రాంతం వైపు ప్రజలు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కేపీఐఎక్స్ సౌజన్యంతో…

Tags

Login

Register | Lost your password?