Home » ఎన్ఆర్ఐ న్యూస్ » అమెరికా గాయకుడితో బాలీవుడ్ భామ డేటింగ్

అమెరికా గాయకుడితో బాలీవుడ్ భామ డేటింగ్

అమెరికాకు చెందిన ప్రముఖ గాయకుడు నిక్ జోనస్ తో బాలీవుడ్ భామ ప్రియాంకచోప్రా డేటింగ్ చేస్తోంది. నిన్న మొన్నటిదాకా ముంబై, గోవా నగరాల్లో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన నిక్, ప్రియాంకలు తాజాగా అమెరికాలో దర్శనమిచ్చారు. పీకల దాకా ప్రేమలో దిగిన ఈ జంట అమెరికాలోని పర్యాటక స్థలాల్లో విహరిస్తోంది. నిక్, ప్రియాంకల పెళ్లికి అటు నిక్ తో పాటు ప్రియాంకల కుటుంబసభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని రెస్టారెంట్లు, పార్కుల చుట్టూ తిరిగుతూ ప్రేమ గీతాలు పాడుకుంటున్నారు. హాలివుడ్ టీవీ సీరియల్ లో నటించిన ప్రియాంకచోప్రా నిక్ తో ఏర్పడిన పరిచయంతో ప్రేమలో దిగిందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

వీడియో స్పాష్ న్యూస్ సౌజన్యంతో …

Tags

Login

Register | Lost your password?