Home » అమరావతి ముచ్చట్లు » ప్రవాసాంధ్రుల అభ్యున్నతికి ఏపీ ప్రత్యేక పథకాలు…సీఎం వెల్లడి

ప్రవాసాంధ్రుల అభ్యున్నతికి ఏపీ ప్రత్యేక పథకాలు…సీఎం వెల్లడి

విజయవాడ : ప్రవాసాంధ్రుల అభ్యున్నతి కోసం కొత్తాంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు ప్రత్యేక పథకాలు అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. విజయవాడలో ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సంఘం ప్రతినిధులతో సీఎం సమీక్షించారు. ప్రవాసాంధ్రుల కోసం తాము ప్రవాసాంధ్ర భరోసా, సహాయనిధి, హెల్ప్ లైన్ పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏపీఎన్ఆర్టీ సంఘంలోని 42,600 మంది సభ్యుల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి రూ. పదిలక్షలు సాయం చేస్తామన్నారు. ప్రవాసాంధ్రుల నుంచి ఎలాంటి డబ్బు తీసుకోకుండానే ఏపీఎన్ఆర్టీలో ఉచితంగా సభ్యత్వం కల్పించడంతోపాటు ప్రత్యేక పెట్టుబడుల మండలిని ఏర్పాటు చేసిందన్నారు. ప్రపంచంలోని 106 దేశాల్లో 30 లక్షల మంది ఎన్ఆర్ఐలున్నారని వారిలో ఎక్కువమందికి తమ సంస్థ సభ్యత్వం ఇస్తామని ఏపీఎన్ఆర్టీ సీఈవో కోగంటి సాంబశివరావు చెప్పారు.

Tags

Login

Register | Lost your password?