Home » అమరావతి ముచ్చట్లు » కొత్తాంధ్రప్రదేశ్‌‌లో కొత్తగా 21 ఐటీ కంపెనీలు : ఏపీఎన్ఆర్టీ ఛైర్మన్ రవి వెల్లడి

కొత్తాంధ్రప్రదేశ్‌‌లో కొత్తగా 21 ఐటీ కంపెనీలు : ఏపీఎన్ఆర్టీ ఛైర్మన్ రవి వెల్లడి

అమరావతి : కొత్తాంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రంలో కొత్తగా అక్టోబరు నెలాఖరుకల్లా 21 ఐటీ కంపెనీలు ఆరంభం అవుతాయని ఏపీఎన్ఆర్టీ ఛైర్మన్ రవి వెల్లడించారు. ఈ కొత్త కంపెనీల ఏర్పాటుతో మరో 3,390 మందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన 75 కంపెనీలు కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలో బ్రాంచీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయని, వీటి ద్వారా రెండువేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఐటీ కంపెనీలు ప్రారంభించే ప్రవాసాంధ్రులకు కార్యాలయ వసతి కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారని రవి వివరించారు.

Tags

Login

Register | Lost your password?