Home » ఎన్ఆర్ఐ న్యూస్ » స్పా కేంద్రాల మాటున థాయ్‌ల్యాండ్ అమ్మాయిలతో వ్యభిచారం

స్పా కేంద్రాల మాటున థాయ్‌ల్యాండ్ అమ్మాయిలతో వ్యభిచారం

హైదరాబాద్ : థాయ్‌లాండ్ అమ్మాయిలను రప్పించి వారితో స్పా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి మాటున వ్యభిచారం సాగిస్తున్న బాగోతం హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది. చిత్తూరు నగరానికి చెందిన ఆదిత్య అనే వ్యక్తి హైదరాబాద్ నగరంలోని కొంపల్లి, బంజారాహిల్స్, సోమాజీగూడ, మాదాపూర్, రాయదుర్గం,దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో స్సా కేంద్రాలు ఏర్పాటు చేశాడు. మసాజ్ పేరిట విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం సాగిస్తున్నట్లు పోలీసులకు అందిన సమాచారం మేర దాడులు చేసి నిందితుడైన ఆదిత్యను అరెస్టు చేశారు. విదేశీ అమ్మాయిలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

Tags

Login

Register | Lost your password?