Home » ఎన్ఆర్ఐ న్యూస్ » ప్రవాసాంధ్రులు ఏపీఎన్ఆర్టీ భరోసా బీమా పొందాలంటే…

ప్రవాసాంధ్రులు ఏపీఎన్ఆర్టీ భరోసా బీమా పొందాలంటే…

అమరావతి : ప్రవాసాంధ్రులు భరోసా ప్రవాస భారతీయ బీమా పథకం కింద విదేశాల్లో పనిచేస్తూ ఎవరైనా మరణించినా, వికలాంగులుగా మారిన వారి కుటుంబసభ్యులకు రూ.10 లక్షలు బీమాగా అందిస్తారు. ఈ పథకం కింద మూడేళ్లపాటు ఏటా రూ.125 ప్రీమియం చెల్లించాలని ఏపీఎన్ఆర్టీ ఛైర్మన్ వేమూరి రవి వెల్లడించారు. ఎన్ఆర్ఐలు ఆసుపత్రిలో చికిత్స కోసం లక్షరూపాయలు, ప్రసూతి సేవల కోసం రూ.50 వేలు, లీగల్ సేవలకు రూ.45వేలు ఇస్తామని రవి పేర్కొన్నారు. బాధితులు స్వదేశానికి తిరిగివస్తే వారికి విమాన టికెట్ ను కూడా ఏపీ ప్రభుత్వమే అందిస్తుందని ఆయన వివరించారు. ప్రవాసాంధ్ర బాధితులకు వైద్యసేవలు, సహకారం అందించేందుకు కోటిరూపాయలతో ఏపీ సర్కారు సహాయనిధిని ఏర్పాటు చేసింది. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి 24 గంటలూ పనిచేసేలా 1100 నంబరుతో ప్రత్యేకంగా కాల్ సెంటరును ఏర్పాటు చేశామని రవి వివరించారు.

Tags

Login

Register | Lost your password?