Home » క్రీడల కబుర్లు » ఒలింపిక్స్ విజేత సింధుకి గ్రూప్ వన్ ఉద్యోగం

ఒలింపిక్స్ విజేత సింధుకి గ్రూప్ వన్ ఉద్యోగం

అమరావతి : ఒలింపిక్స్ విజేత పీవీ సింధును గ్రూపువన్ సర్వీస్‌లో నియమించేందుకు వీలుగా ఏపీ (రెగ్యులేషన్ ఆఫ్ అప్పాయింట్‌మెంట్ టు పబ్లిక్ సర్విసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాట్రన్ అండ్ పే స్ట్రక్చర్) యాక్ట్ 2-1994కు సవరణలు చేసి శాసనసభలో ప్రవేశ పెట్టేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలోని సర్వే నెంబర్ 15, రిషికొండ గ్రామంలోని సర్వే నెంబర్ 37, 38లలో గల 36.07 ఎకరాల భూమిపై 26.02.2014లో సీసీఎల్‌ఏ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. సీసీఎల్ఎ ఈ భూములను ఇంతకుముందు సంస్థలకు గానీ, ప్రభుత్వ శాఖలకు గానీ ఇచ్చి వుంటే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది.

బుగ్గ కార్లు
మంత్రులు, అధికారులు, ప్రముఖుల వాహనాలపై నీలి, ఎర్ర రంగు బుగ్గల వినియోగాన్ని ఉపసంహరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

Tags

Login

Register | Lost your password?